యాంకర్ అనే పదానికి గ్లామర్ ని పరిచయం చేసిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు యాంకరింగ్ ని వదిలేసి వెండితెర మీద అవకాశాలు అందుకుంటుంది. అనసూయ బుల్లి గౌను వేసుకున్నా, చీరలో కనిపించినా ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే. ఆమె గ్లామర్ కి యూత్ మొత్తం ఫిదా కావాల్సిందే. పెళ్లయ్యింది, పిల్లలున్నారు.. అయినా అనసూయ క్రేజ్ చెప్పనలవి కాదు, బుల్లితెర మీద, వెండితెర మీద రెండు చోట్లా అనసూయ అందాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు.
వెండితెర మీద ప్యాన్ ఇండియా స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అనసూయ కి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమె సోషల్ మీడియాలో వదిలే ఫొటోస్ కి లైక్స్,షేర్స్ అంటూ నెటిజెన్స్ హోరెత్తిస్తారు. తాజాగా అనసూయ పట్టు చీరలో రెండు జెడలు వేసుకుని చిన్న పిల్లలా కనిపించింది. ఆమె సారీ లుక్ వైరల్ అవగా.. రెండు జడలు వేసుకున్న పెద్ద పాప అంటూ అనసూయని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పట్టు సారీ లో అనసూయ రెండు జడలు వేసుకుని మెడలో సింపుల్ గా నెక్ లెస్ పెట్టుకుని వయ్యారాలు ఒలకబోసిన ఫోటో షూట్ నెట్టింట్లో సంచలనంగా మారింది.