మార్చ్ 6 శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బర్త్ డే. ఈ బర్త్ డే జాన్వీ కపూర్ కి స్పెషల్ బర్త్ డే. ఎందుకంటే ఆమె నటిస్తున్న, ఒప్పుకున్న సౌత్ మూవీస్ నుచి జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ లుక్స్ వదిలారు కాబట్టి. ఒకేసారి గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జాన్వీ కపూర్ అవకాశాలు దక్కించుకుని క్రేజీ హీరోయిన్ గా మారింది. మరి బర్త్ డే రోజున చాలామంది సెలెబ్రిటీస్ పార్టీలనో, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ తో వెకేషన్స్ అనో ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోతారు.
కానీ జాన్వీ కపూర్ మాత్రం ఈ ప్రత్యేకమైన రోజున తనకి ఎంతో ఇష్టమైన తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చింది. ఈ రోజు బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జాన్వీ కపూర్ ఆతర్వాత ఆలయ పూజారుల ఆశీర్వాదాలు పొందింది. తిరుమల ఆలయానికి జాన్వీ కపూర్ వెంట శిఖర్ పహారియా అలాగే ఆమె పిన్ని మాజీ హీరోయిన్ మహేశ్వరీ కూడా ఉన్నారు.
జాన్వీ-శిఖర్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనే న్యూస్ నడుస్తుంది. ఇద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించారు. రీసెంట్ గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లోను శిఖర్ తో కలిసి జాన్వీ కనిపించింది. ఇప్పుడు ఆలయానికి కూడా కలిసే వచ్చారు. శిఖర్ పహారియా పంచె కట్టులో, కండువా ధరించి సంప్రదాయ వేషధారణలో కనిపించగా జాన్వీ కపూర్ ఎప్పటిలాగే పట్టు పరికిణి వోణిలో కనిపించి కనువిందు చేసింది.