యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ గా హిందీపై ఫోకస్ పెట్టాడనిపిస్తుంది. అసలు ముంబై వెళ్ళనట్టే ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు హిందీలో వరస సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే వార్ 2 సెట్స్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్ ఏజెంట్ గా కనిపించనున్నాడని న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసింది.
ఇప్పుడు ఎన్టీఆర్ మరో హిందీ చిత్రాన్ని ఓకె చేసాడని అది కూడా వార్ 2 బ్యానర్ లోనే, వార్ 2 లో చేసినట్టుగా ఏజెంట్ కేరెక్టర్ లోనే ఆ చిత్రంలో చేస్తాడని అంటున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్‌లోనే ఇంకో బాలీవుడ్ మూవీ చేసేందుకు తారక్ సైన్ చేసాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ చెయ్యబోయే నెక్స్ట్ హిందీ మూవీ డైరెక్టర్ ఎవరనే విషయం క్లారిటీ లేకపోయినా.. ఎన్టీఆర్ తదుపరి హిందీ మూవీ గురించి ఈ అప్ డేట్స్ వైరల్ గా మారాయి.
మరి ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ హిందీ మీద సైలెంట్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపించకమానదు. ప్రస్తుతం కొరటాలతో దేవర మూవీ కంప్లీట్ చేసి వార్ 2 ప్రశాంత్ నీల్ తో NTR31 చిత్రం ఆ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ హిందీ చిత్రంలోకి వెళతాడని తెలుస్తోంది.