గత ఏడాది మార్చ్ 6 న యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ దేవర నుంచి బర్త్ డే గ్రీటింగ్స్ అందుకున్న జాన్వీ కపూర్ మళ్ళీ ఇదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 నుంచి బర్త్ డే కి స్పెషల్ విషెస్ అందుకుంది. ఎన్టీఆర్ దేవర సెట్స్ లోకి అడుగుపెట్టక ముందే జాన్వీ కపూర్ ని దేవరలోకి ఆహ్వానిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది దేవర టీమ్. మళ్ళీ అదే మాదిరి రామ్ చరణ్ తో చెయ్యాల్సిన RC16 సెట్స్ లోకి అడుగుపెట్టకముందే జాన్వీ కపూర్ ని ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ ఆమె పుట్టినరోజున బర్త్ డే విషెస్ అందజేశారు RC16 మేకర్స్.
అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాల్లోకి జాన్వీ కపూర్ ఇలా అడుగుపెట్టింది. ప్రస్తుతం దేవర షూటింగ్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ ఇకపై RC16 సెట్స్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుంది. మార్చ్ చివరి వారం నుంచి బుచ్చిబాబు-రామ్ చరణ్ ల RC16 పట్టాలెక్కేందుకు చకచకా సిద్దమవుతుంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ రెండో సౌత్ బిగ్గెస్ట్ ఆఫర్ అందుకుంది. మరి నిజంగా జాన్వీ కపూర్ కి ఈ బర్త్ డే స్పెషల్ అనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుని అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ఇక జాన్వీ కపూర్ హిందీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నా.. తమిళనాట స్టార్ హీరో సూర్య తో కోలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఆమె తండ్రి బోని కపూర్ చెప్పారు. సూర్య హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే కర్ణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది.