నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బాబీ కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK109 షూటింగ్ మార్చ్ చివరి కల్లా ఫినిష్ అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసేసి ఏపీ ఎన్నికల్లో ఆయన బిజీ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే బాలకృష్ణ-బాబీ చిత్రం ఓ మల్టిస్టారర్ లా తెరకెక్కుతుంది అనే న్యూస్ ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు అనగానే ఈ ప్రాజెక్ట్ పై మరింతగా క్రేజ్ పెరిగింది.
అయితే దుల్కర్ NBK109 లో భాగమవుతున్నాడనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. సినిమా మొదలైనప్పుడు క్రేజీ క్రేజీ గా అప్ డేట్స్ వదిలిన మేకర్స్.. ఇప్పుడు ఈ చిత్రం పై సైలెంట్ గా ఉండడంతో.. షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో తెలియక నందమూరి అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. అంతేకాకుండా సడన్ గా దుల్కర్ సల్మాన్ NBK 109 నుంచి తప్పుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అభిమానులు మరింతగా డిస్పాయింట్ అవుతున్నారు. అసలు దుల్కర్ ఎందుకు తప్పుకున్నాడో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తుండగా.. ఊర్వశి రౌతేల్ల కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రాన్ని మే లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.