సోమవారం సోషల్ మీడియా అంతా ఇదే రాతలు. అంబానీ ఇంట పెళ్లిలో రామ్ చరణ్‌ని షారుక్ ఖాన్ అవమానించరంటూ ఒకటే వార్తలు. అంతకు ముందు రోజు మాత్రం ఖాన్ త్రయంతో మన రామ్ చరణ్ కబాడీ ఆడేశాడు అంటూ ఒకటే పొగడ్తలు, ప్రశంసలు. ఒక్క రోజు గ్యాప్‌లో ఇలా అవమానం అంటూ రామ్ చరణ్ పేరు వైరల్ అవుతోంది. దీనికి కారణం ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్ ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్టే. రామ్ చరణ్‌ని షారుఖ్ అలా పిలవడం నచ్చలేదంట.. అందుకని అక్కడి నుండి ఆమె వచ్చేసిందట. నిజంగా ఇది రామ్ చరణ్‌కి అవమానమేనా?
అసలేం జరిగింది?
అంబానీ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో బాలీవుడ్ మొత్తం సందడి చేసింది. టాలీవుడ్ నుంచి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ స్టేజ్‌పై డ్యాన్స్‌లు చేస్తూ.. ఆహుతుల్ని అలరించే ప్రయత్నం చేశారు. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు షారుక్, సల్మాన్, ఆమిర్‌ల ఖాన్ త్రయం స్టెప్పులేశారు. వారు డ్యాన్స్ చేస్తుండగానే.. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ.. షారుక్ దగ్గరకు వచ్చి.. రామ్ చరణ్ ఇక్కడే ఉన్నాడు.. స్టేజ్‌పైకి పిలవండి అని చెప్పింది. వెంటనే ఖాన్ త్రయం రామ్ చరణ్, రామ్, రామ్ అంటూ చరణ్‌కి ఆహ్వానం పలికారు. వీరిలో షారుఖ్.. రామ్ చరణ్ ఎక్కడున్నావ్.. ఇడ్లీ సాంబార్ తినేసి.. కూర్చున్నావా.. బెండ్ ఇడ్లీ.. మా మాటలు వినబడుతున్నాయా? స్టేజ్ పైకి రా.. అంటూ పిలిచాడు. రామ్ చరణ్ కనబడే వరకు రామ్, రామ్ అంటూ అరుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఖాన్‌ల త్రయం నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ చేతి నుండి ఏదో పడిపోతే.. సల్మాన్ ఖాన్ తీసి ఇచ్చారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. మనోడు రేంజ్ ఇదంటూ ఇక్కడ టాలీవుడ్‌లో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.
ఇది అవమానమా?
ఒక రకంగా చూస్తే ఇది అవమానమనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇడ్లీ, సాంబార్ అనే పదం షారుక్ వాడటం వల్ల.. అది సౌత్, నార్త్ తేడాలను కోట్ చేస్తున్నట్లుగా ఉంది. సౌత్‌ని అవమానించినట్లుగానే అంతా భావిస్తున్నారు. కానీ, అక్కడ ఇంకో రకంగా చూస్తే.. రామ్ చరణ్ అంటే వారికి అంత చనువు ఉందని కూడా అనుకోవచ్చు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు.. జనరల్‌గా అంతా ఇలానే అనుకుంటూ ఉంటారు. తినేసి కూర్చున్నావా? అంటూ సాదారణంగా ఫ్రెండ్స్ అనుకునే పదమే. దానిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు. అంతేకాదు, రామ్ చరణ్ స్టేజ్‌పైకి వెళ్లగానే అతని కాళ్లకి షారుక్ నమస్కారం పెట్టబోయారు. అంత టీజ్ చేసేంత చనువు వారి మధ్య ఉంది కాబట్టే.. అలా పిలిచి ఉండవచ్చని అనుకోవచ్చు. దీనిని భూతద్ధంలో చూడాల్సిన అవసరం అయితే లేదు.
అది చాలదా..
స్టేజ్‌పై ముగ్గురు ఖాన్‌లు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు వాళ్లు. వారి దగ్గరకు వెళ్లి నీతా అంబానీ.. ఇక్కడ రామ్ చరణ్ ఉన్నాడని చెప్పడం చూస్తుంటే తెలియడం లేదా? సౌత్ రేంజ్ ఏంటో? అది చాలదా! దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అందులోనూ.. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్‌కు ఏం అర్థమైందో? ఆమె మనసులో ఏముందో? దీనిని అంత పబ్లిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అందులోనూ షారుక్ ఈ మధ్య సోషల్ మీడియా చాట్స్‌లోనూ చాలా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిని కూడా సరదాగా తీసుకోవచ్చు. అయినా.. ముగ్గురు ఖాన్‌లు అంత పెద్ద స్టేజ్‌పై, అంత పెద్ద ఈవెంట్‌లో రామ్ రామ్ అంటూ జపం చేసే రేంజ్‌లో ఈ గ్లోబల్ స్టార్ ఉన్నాడనేది ఎందుకు ఆలోచించడం లేదు. ఒక్కడికే పేరు వచ్చేస్తుందని.. కావాలని ఎవరైనా కాంట్రవర్సీ చేస్తున్నారా? ఏంటి? ఏమో చెప్పలేం.. ఇప్పుడున్న కాంపిటేషన్‌లో.. మన అనుకున్న వారిని కూడా నమ్మడానికి లేదు.