Advertisement
Google Ads BL

హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే


నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు తెరంగేట్రం చేస్తాడా అని ఎదురు చూడని నందమూరి అభిమాని లేరు. బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీకి ఎప్పుడు ముహూర్తం చూస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. బాలయ్యేమో.. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ చెబుతారు కానీ స్పష్టత ఇవ్వరు. దానితో నందమూరి అభిమానులు ఎదురు చూడడం డిస్పాయింట్ అవడం చూస్తున్నాం.

Advertisement
CJ Advs

ప్రతి ఏడాది బాలకృష్ణ పుట్టిన రోజునాడు, అలాగే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రం పై అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలతో పాటుగా, బాబీ చిత్రంతో బిజీగా వున్నా బాలకృష్ణ మోక్షజ్ఞ ని పరిచయం చెయ్యబోయే చిత్రం కోసం కథలు వింటున్నారని టాక్ వినిపిస్తోంది. అసలైతే బాలయ్య ఆదిత్య 999 చిత్రం ద్వారా మోక్షజ్ఞని తెరకి పరిచయం చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు కొత్త కథలని వింటున్నారని అంటున్నారు.

మరోపక్క మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ అతను హీరో అయ్యేందుకు తగ్గట్టుగా ఉండడంతో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మోక్షజ్ఞ ఈ మధ్యన ఎక్కడ కనిపించినా హీరో మాదిరిగా స్లిమ్ గా, హ్యాండ్ సమ్ గా కనిపించడమే తరువాయి అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక మోక్షజ్ఞ ని తెరకి పరిచయం చేసే అదృష్టం ఏ దర్శకుడికి దక్కుతుందో చూడాలి. 

Mokshagna entry as a hero was this year:

Mokshagna to enter industry, we have to wait and see
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs