టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అనుకున్నంత ఫేమ్ దక్కక మళ్ళీ బాలీవుడ్ కే ఎగిరిపోయిన కియారా అద్వానీ కి అక్కడ కబీర్ సింగ్ హిట్ ఆమెని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మార్చేసింది. ఆ దెబ్బకి సౌత్ హీరోల ద్రుష్టి ఆటోమాటిక్ గా కియారా పై పడింది. గత ఏడాది బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న కియారా హనీమూన్ కి కూడా వెళ్ళకుండా సినిమా షూటింగ్స్ తో బిజీగా కనిపిస్తుంది.
ప్యాన్ ఇండియా ఫిల్మ్ గేమ్స్ చెంజర్ లో రామ్ చరణ్ తో జోడి కడుతున్న కియారా అద్వానీ కి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన వార్ 2 తో పాటుగా డాన్ 2లో రణ్వీర్ సింగ్ కి జోడిగా కనిపించబోతుంది. మరి క్రేజీ హీరోలు, క్రేజీ ప్రాజెక్ట్స్. అందుకే కియారా అద్వానీ డిమాండ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిందట. ఇప్పటివరకు ఏడు నుంచి ఎనిమిది కోట్లు తీసుకుంటున్న కియారా డాన్ 2 కోసం ఏకంగా 13 కోట్లు డిమాండ్ చేస్తుందట. 13 కోట్లు కియారా అద్వానీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఫిగర్ గా చెబుతున్నారు.
మరి ఈ లెక్కన వార్ 2కి కూడా కియారా గట్టిగానే అందుకుంటుందేమో. అయితే ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడి కట్టేది హృతిక్ రోషన్ తోనా? లేదంటే ఎన్టీఆర్ తోనా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రెండు రోజుల క్రితమే భర్త సిద్దార్థ్ తో కలిసి అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో గ్లామర్ గా కనిపించింది.