కొన్నాళ్లుగా నటనకు దూరంగా సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటున్న సమంత మళ్ళీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లుగా చెప్పింది. అంతేకాదు.. రీ ఎంట్రీకి అవసరమైన ఏర్పాట్లలో సమంత మునిగిపోయింది. దానిలో భాగంగా సమంత తరచూ గ్లామర్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. సమంత హెల్త్ రీజన్స్ వలన ఆమె మొహం లో గతంలో ఉన్న గ్లో కోల్పోయింది. కానీ ఇప్పుడు మునుపుటి కళతో సమంత మెరిసిపోతూ కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో తాను షూటింగ్ లకి సిద్దమే అనే సంకేతాలు ఇండస్ట్రీకి పంపిస్తుంది. టూ గ్లామర్ షో చేస్తూ వెకేషన్స్ లో సేద తీరుతుంది. నిన్నఆదివారం ఫార్మల్ డ్రెస్ లో సమంత ఓ ఫోటో షూట్ ని ఇన్స్టాలో షేర్ చెయ్యగానే అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. అంతేకాకుండా సమంతకి ఆధ్యాత్మికత ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఆమె తరచూ సద్గురు ఆశ్రమానికి వెళుతూ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటుంది. ఒక్కోసారి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ ఆమె వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. తాజాగా సమంత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ని దర్శించుకుంది. ఈ రోజు సోమవారం ఉదయం సమంత సాంప్రదాయ దుస్తుల్లో వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మవారి దర్శనానంతరం ఆమె అభిమానులతో ఫొటోలకి ఫోజులిచ్చింది.