టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాక తర్వాత హీరో పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్ ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుస వైఫల్యాలతో మార్కెట్లో గోపీచంద్ సినిమాలకి డిమాండ్ పడిపోయింది. టైమ్ కలిసి రావడం లేదో.. అదృష్టం లేదో కానీ గోపీచంద్ హిట్ కొట్టి కొన్నేళ్లు అవుతుంది. వరస సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దరి చేరడమే లేదు.
ఇప్పుడు కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో భీమా అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత పది రోజులుగా భీమా ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో గోపీచంద్ హడావిడి చేస్తున్నాడు. భీమా తో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం గోపీచంద్ కి ఏర్పడింది. భీమా ప్రేక్షకులని ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పరచదని, కంటెంట్ పై నమ్మకం ఉంది కాబట్టే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నట్టుగా చెప్బుతున్నాడు.
మరి మహా శివరాత్రి గోపీచంద్ కి హిట్ ని అందిస్తుందో.. లేదంటే మళ్ళీ ప్లాప్ ల లిస్ట్ లోకి నెట్టేస్తుందో.. కానీ గోపీచంద్ మాత్రం భీమా హిట్ అవుతుంది అని చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో హిట్ కొట్టకపోతే గోపీచంద్ మార్కెట్ కోలుకోవడం కష్టమే. చూద్దాం భీమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనేది.