Advertisement
Google Ads BL

సలార్ 2 కి ముహూర్తం కుదిరింది


గత ఏడాది డిసెంబర్ లో ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ ప్యాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రంలో ప్రభాస్-పృథ్వీ రాజ్ లు స్నేహితులుగా కనిపించారు. సలార్ కి సెకండ్ పార్ట్ ఉంటుంది అంటూ సౌర్యంగ పర్వగా సలార్ పార్ట్ 2ని అనౌన్స్ చేసారు. మరి సలార్ పార్ట్ 2 ఎప్పడెప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకుంటుందా అని ప్రభాస్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ప్రశాంత్ నీల్ సలార్ 2 షూటింగ్ కి ముహూర్తం పెట్టినట్లుగా.. సలార్ లో కీ రోల్ పోషించిన బాబి సింహ చెప్పడంతో ప్రభాస్ అభిమానులే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్షకులంతా సలార్ 2 అప్ డేట్ గురించి చాలా ఆత్రంగా ఉన్నారు. సలార్ 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కాబోతున్నట్టుగా బాబీ సింహ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో మాస్ అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ పార్ట్ 1 కన్నా సలార్ పార్ట్ 2 లోనే అసలు కథ ఉండడంతో అందరిలో అంచనాలు, ఆసక్తి రెండూ పెరుగుతున్నాయి.

సలార్ పార్ట్ 1 కి మించి పార్ట్ 2 లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలివేషన్ భారీగా ఉండబోతుందట. ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి చేసి మారుతి మూవీ రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా సలార్ పార్ట్ 2 పూర్తి చేస్తారట.

Bobby Simha on Salaar 2 developments:

Salaar 2 update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs