రామ్ చరణ్-ఉపాసనలు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి గుజరాత్ కి వెళ్ళారు. అక్కడ జామ్ నగర్లో జరిగిన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో సందడి చేసారు. టాలీవుడ్ నుంచి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కోసం ఆహ్వానం అందిన ఏకైన అతిథి రామ్ చరణ్. తన భార్య ఉపాసనతో కలిసి చరణ్ గుజరాత్ లోని జామ్ నగర్ కి వెళ్ళారు. అక్కడ శనివారం సాయంత్రం జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సంగీత్ నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ.
ఈ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన షారుఖ్ ఖాన్, అమీరా ఖాన్, సల్మాన్ ఖాన్ లు ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. ఈ బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటుగా రామ్ చరణ్ కూడా కాలు కదిపిన పిక్స్ సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అలాగే ఈవెంట్ లో జాన్వీ కపూర్, ఖుషి కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే లతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డాన్స్ చేసిన వీడియోస్ కూడా నెట్టింట్లో సంచలనంగా మారాయి.
ఇక అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్న్ ముగియడంతో సెలెబ్రిటీస్ ఒక్కొక్కరిగా గుజరాత్ ని వీడి తమ తమ ప్రదేశాలకి వెళ్లిపోతున్నారు. రామ్ చరణ్-ఉపాసనకు కూడా గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.