Advertisement
Google Ads BL

హ్యాపీ యానివర్సరీ హస్బెండ్-మంచు మౌనిక


మంచు మనోజ్ గత ఏడాది ఇదే రోజున అంటే మార్చ్ 3 న భూమా మౌనిక రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు కి ఇష్టం లేకపోయినా.. మనోజ్ తన అక్క లక్ష్మి ఇంట్లోనే మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసాడు. మంచు మోహన్ బాబు కొడుకు, కోడలిని ఆశీర్వదించి వెళ్ళారు. ఇక మౌనికతో వివాహం సమయానికి ఆమె కి ఓ కొడుకు ఉన్నాడు. మనోజ్ భార్యగా మౌనిక బాధ్యతలతో పాటుగా.. ఆమె కొడుకు ధైరవ్ భాద్యతలు తీసుకున్నాడు. మనోజ్-మౌనిక పెళ్లి తర్వాత ఇద్దరూ అటు సామజిక కార్యక్రమాలు, ఇటూ ఫ్యామిలీతో కలిసి సంతోషమైన మూమెంట్స్ తో ఓ ఏడాది పూర్తి చేసుకున్నారు.

Advertisement
CJ Advs

గత ఏడాది మనోజ్ తాను తండ్రిగా ప్రమోట్ కాబోతున్న విషయాన్ని ప్రకటించాడు. రీసెంట్ గా మౌనిక బేబీ బంప్ ఫొటోస్ ని షేర్ చేసారు. మౌనిక-మనోజ్ ల ప్రేమకి గుర్తుగా త్వరలోనే వారి మధ్యకి మరో బిడ్డ రాబోతుంది.

మనోజ్-మౌనిక పెళ్లి చేసుకుని ఏడాది పూర్తవడంతో మొదటి యానివర్సరీని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. మనోజ్-మౌనిక తమ కొడుకు ధైరవ్ తో కలసి సంతోషంగా డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేసిన పిక్ తో పాటుగా బీచ్ లో తమ తమ పేర్లతో ఇసుకలో రాసిన పిక్ ని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా మనోజ్ కి థాంక్స్ చెప్పింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హస్బెండ్, ఈ లైఫ్ స్టార్ట్ అయినప్పటినుంచి నువ్వు నాకు తెలుసు అనిపిస్తోంది. మన మధ్యన అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ధైరవ్ కి నీ హృదయంలో చోటిచ్చినందుకు థాంక్స్. 

ఫ్రెండ్షిప్, పార్ట్నర్ షిప్, క్రేజీ షిప్ ఇలా అన్నింటీని అందించిన యానివర్సరీకి కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు ప్రేమపై ,పెళ్లిపై మళ్ళీ నమ్మకం వచ్చేలా చేసాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మనోజ్, ఐ లవ్ యు, నా మనసులో నీకు ప్రత్యేక  స్థానం ఎప్పటికి ఉంటుంది అంటూ మౌనిక చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

హ్యాపీ యానివర్సరీ హస్బెండ్-మంచు మౌనిక :

Manchu Manoj-Bhuma Mounika celebrates first wedding anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs