Advertisement
Google Ads BL

పెళ్ళికి సిద్దమైన రెజినా


ఈమధ్యన వినిపించడం లేదు కానీ.. ఒకప్పుడు రెజినా కాసాండ్రా పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. కుర్ర హీరోలతో జోడి కట్టడమే కాకుండా.. ఏకంగా సందీప్ కిషన్ తో ప్రేమలో ఉంది అనే ప్రచారమూ జరిగింది. అది రూమర్ అని కొట్టిపారేసినా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒకటి రెండు సినిమాల్లో కనిపించేసరికి.. సాయి ధరమ్ తేజ్-రెజినా పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ నిన్నమొన్నటివరకు వినిపిస్తూనే ఉంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అడుగంటడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయిన రేజీనాకి అక్కడ అంతంతమాత్రపు అవకాశాలే రావడంతో ఓటిటీ ప్లాట్ ఫామ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సీరీస్, చిన్న సినిమాలతో కాలక్షేపం చేస్తున్న రెజినా ఫైనల్ గా పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చెన్నై కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని రెజినా వివాహమాడేందుకు రెడీ అయినట్లుగా, ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చినట్లుగా కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబందించిన మాటలు కూడా పూర్తయ్యాయి, త్వరలోనే రెజినా తన పెళ్లి వార్తని ప్రకటిస్తుంది అంటున్నారు. 

Actress Regina Ready for Marriage:

Regina Cassandra into wedding lock
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs