Advertisement
Google Ads BL

కల్పిత కట్టు కథ.. RGV భయపడ్డాడ్రా!


అప్పుడెప్పుడో ఒక సినిమాతో వీర పొడుపుడు పొడిచిన వర్మ.. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్పుకునే సమాజంలో చెలామణీ అవుతున్నాడు. ఈ మధ్య మరీ దారుణంగా చెడిపోయాడు. కళ్లు మూస్తే బూతు సినిమాలు.. కళ్లు తెరిస్తే గుంటనక్క డ్రామాలు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ డ్రామాలతో ఓ పార్టీకి తొత్తుగా మారిపోయాడు. ఒకప్పుడు ఆయనని క్రియేటివ్ జీనియస్‌గా చూసిన వారే.. ఇప్పుడో కీటకం కింద పరిగణిస్తున్నారంటే.. ఎంతగా ఆయన దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. కాదు కాదు.. అమ్మాయిల్ని, ఆల్కహాల్‌ని చూపిస్తూ.. ఆయనే తనంతట తానే  అంతగా దిగజారిపోయారు అంటే బాగుంటుందేమో.. అది ఎవరు, ఏంటనేది అప్రస్తుతం. ఇలా చెప్పుకుంటూ పోతే.. అసలు విషయం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయేంత మ్యాటర్ ఉందీ మహానుభావుడి గురించి. అందుకని విషయంలోకి వచ్చేద్దాం.

Advertisement
CJ Advs

వర్మ ఎందుకు సినిమాలు తీస్తున్నాడంటే.. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవ్వడైనా చెప్పే సమాధానం.. ఒకటి తన సుఖం కోసం.. రెండోది వైసీపీ పార్టీలో ఆనందం కోసం. తన సుఖం కోసం చేసే సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వైసీపీ పార్టీలో ఆనందం నింపడం కోసం.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలోని వ్యక్తులని కించపరిచేలా పాత్రలు సృష్టించి మరీ సినిమాలు తీయడం. ఇప్పుడిదే వర్మ దినచర్య. దీనికోసం.. సరిగ్గా ఎన్నికల సమయంలో వర్మ ప్రదర్శించే ఈ వ్యూహ చతురత.. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఆయన్ని కుబేరుడిని చేస్తుందంటే.. ఆయన చేసుకున్న శపథం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

ఇక సినిమా తీసిన తర్వాత సోషల్ మీడియాలో.. ఆయన టార్గెట్ చేసిన వ్యక్తుల గురించి బీరాలు పోయే వర్మ.. విడుదల సమయానికి నేనెవర్నీ టార్గెట్ చేయలేదు.. ప్రేమతో, అభిమానంతో చేశానంటూ ఇచ్చే బిల్డప్స్‌కు అయితే లెక్కే లేదు. ఎన్ని చేసినా ఏం లాభం.. జనాలకు ఆ వ్యక్తి ఎలాంటోడు తెలిసినప్పుడు.. అతనిలో నిజాయితీ చచ్చిపోయినప్పుడు. వ్యూహం సినిమా విడుదలకు ముందు వర్మ ఇచ్చిన బిల్డప్స్‌కి.. విడుదల కోసం వేసిన వేషాలకు.. సినిమాలో ప్రదర్శించిన ఈ గమనికే నిదర్శనం. సినిమా తీసే సమయంలో మగాడిని అని మీసం తిప్పిన వర్మ.. కల్పిత కథ అంటూ ఈ గమనికలో చెప్పిన విషయాలు చూస్తే.. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా.. అరేయ్.. RGV భయపడ్డాడ్రా! అని అనకుండా, అనుకోకుండా ఉండలేరు. ఆ గమనిక ఇదే..

1. ఈ చిత్రం పూర్తిగా కల్పిత రచన, ఇది నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరియు వీక్షకుల వినోదం కొరకు దాని నిర్మాతలచే సృష్టించబడింది. ఈ చిత్రంలో వ్యక్తీకరణలు మరియు స్టేట్‌మెంట్‌లు పూర్తిగా ఈ చిత్రంలో చిత్రీకరించబడిన ప్రదర్శనలు మరియు సంఘటనలను నాటకీయంగా చూపించడం కోసం మాత్రమే. 

2. ఈ చిత్రం జీవించి ఉన్న లేదా చనిపోయిన మరియు పోలిక ఉన్న ఏ వ్యక్తి యొక్క డాక్యుమెంటరీ లేదా జీవిత చరిత్రగా పరిగణించబడదు. ఏదైనా జీవించి ఉన్న వ్యక్తిని సినిమాలోని పాత్రలు పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు. ఇది చిత్ర దర్శకుడుగానీ నిర్మాతగానీ బాధ్యత వహించరు. 

3. ఈ చిత్రంలో వర్ణించబడిన లేదా ప్రస్తావించబడిన పాత్రలు, న్యాయపరమైన విషయాలు, సంఘటనలు మరియు/ లేదా సంఘటనలు. పేరు(ల)కి ఏదైనా సారూప్యత లేదా సారూప్యత. పాత్ర(లు), చరిత్ర, వ్యాపారాలు, ప్రాంతాలు, సంఘటనలు, న్యాయపరమైన మరియు, లేదా కోర్ట్ ప్రొసీడింగ్స్ మరియు అన్నీ రచయిత ఊహ మాత్రమే. చలనచిత్రంలో ఏదైనా వ్యక్తికి (జీవించిన లేదా చనిపోయిన) మరియు/లేదా ఏదైనా సంస్థ. సంస్థ లేదా సమూహం(నేడు ఉనికిలో ఉన్నా లేదా లేకపోయినా)ను ఉద్దేశించబడలేదు. అలా ఏదైనా అనిపించినా అది కేవలం యాదృచ్ఛికం మరియు ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

4. ఈ చలన చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు, మాటలు ఏదైనా వ్యక్తి(లు), మతం (ల) యొక్క విశ్వాసాలు, భావాలు లేదా పద్ధతులను కించపరచడం లేదా ఏదైనా మనోభావాలను గాయపరచడం. సంఘం(IES), కులం(లు) మరియు లేదా ఏదైనా సంస్థ, ఇన్‌స్టిట్యూట్, రాజకీయ పార్టీ, న్యాయవ్యవస్థ లేదా సమూహాన్ని కించపరచడంను ప్రోత్సహించదు. 

(ఈ గమనిక కూడా వోడ్కా వర్మ ట్వీట్ లానే ఉందిగా)

RGV Feared with His Vyooham:

Vyooham is A Fictional Story Says RGV
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs