Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-ప్రశాంత్-రిషబ్ ఫ్రేమ్ అదుర్స్


యంగ్ టైగర్ ఆయన భార్య లక్ష్మి ప్రణతితో సహా బెంగుళూరు వెళ్లారు. ఆయన బెంగుళూరు వెళుతున్నారని తెలియని వారు భార్యతో కలిసి ఎన్టీఆర్ వెకేషన్ ప్లాన్ చేశారేమో అనుకున్నారు. కానీ ఎన్టీఆర్-ప్రణతి ఇద్దరూ బెంగుళూరు వెళ్లి అక్కడ ప్రశాంత్ నీల్-రిషబ్ శెట్టితో కలిసి ఫొటోలకి ఫోజులివ్వడం పట్ల ఎన్టీఆర్ ఫాన్స్ చాలా సర్ ప్రైజ్ అయ్యారు. ఎన్టీఆర్ దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 చెయ్యాల్సి ఉంది. 

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇంట్లో జరగబోయే శుభకార్యం కోసం భార్య ప్రణతితో కలిసి బెంగుళూరుకి వెళ్లారట. అక్కడే ప్రశాంత్ నీల్ భార్యతో సహా ఫోటోలు దిగారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ కి కన్నడ కాంతార రిషబ్ శెట్టి ఆయన భార్యతో కలిసి హాజరవడంతో ఈ ముగ్గురు కలిసి ఒకే ఫ్రెమ్ లో కనిపించారు. ఈ ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో కనిపించడం పట్ల అభిమానులు చాలా సంతోషపడిపోతున్నారు. ఇంకా వీరితో కలిసి మైత్రి మూవీ మేకర్ రవి శంకర్ కూడా ఉన్నారు. 

ఆర్.ఆర్.ఆర్ హీరో, సలార్ దర్శకుడు, కాంతార హీరోని ఇలా సింగిల్ ఫ్రెమ్ లో చూసిన వారంతా అద్దిరిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లెజెండ్స్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ అంటూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్-రిషబ్ శెట్టిల ఫోటో ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

NTR With Sandalwood Bigwigs:

NTR Attends Private Event At Bengaluru Meeting Kannada Celebrities
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs