Advertisement
Google Ads BL

వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమా టైటిల్


విక్టరీ వెంటేష్ తన కెరీర్ లో ఎంతో అపురూపంగా నిలిచిపోవాల్సిన చిత్రాన్ని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్‌ చేసి డిస్పాయింట్ అయ్యారు. ఆ చిత్రం ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది. అయితే వెంకటేష్ సైంధవ్‌ చిత్రం తర్వాత సైలెంట్ గా కనబడుతున్నారు. తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తారు అనే ఆలోచనలో ఆయన ఫాన్స్ ఉండగా.. త్రివిక్రమ్ తో వెంకీ నెక్స్ట్ చిత్రం ఉంటుంది అన్నప్పటికీ.. ఇప్పుడు వెంకీ కి హిట్ ఇచ్చిన దర్శకుడు ఒకాయన లైన్ లోకి వచ్చారు.

Advertisement
CJ Advs

ఆయనే ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి Venky 76 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న న్యూస్. ఇప్పటికే అనిల్ రావిపూడి పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడని, పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారానికి తోడుగా ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేసారు అంటున్నారు. వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నా అనే టైటిల్ రిజిస్టర్ చేసారట మేకర్స్.

మరి టైటిల్ చూస్తేనే ఇది పక్కా పల్లెటూరి నేపథ్యంలో ఉండబోతుంది అని, అలాగే సంక్రాంతి ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ టైటిల్ గా అనిపిస్తోంది. కుటుంభ కథా చిత్రంగా దీనిని వచ్చే ఏడాది సంక్రాతి బరిలో నిలపాలనే ఆలోచనలో అనిల్ ఉన్నట్లుగా సమాచారం. 

Interesting title registered for Venky Next:

Is this Venkatesh-Anil Ravipudi project title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs