రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్ ఫిబ్రవరి 9 న థియేటర్స్ లో విడుదల కాగా.. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ కేరెక్టర్ ఎలివేట్ అయినా.. కంటెంట్ లో బలం లేకపోవడంతో ఈగల్ చిత్రానికి ఆదరణ కరువయ్యింది. రవితేజ ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి మరీ సోలోగా విడుదల చెయ్యగా.. రవితేజకి మరో నిరాశనే మిగిల్చింది ఈగల్. మరి ఫిబ్రవరి 9 న థియేటర్స్ లో విడుదలైన ఈ చితం ఓటిటీ రిలీజ్ పై ఏవేవో కథనాలు నడిచాయి.
ఈగల్ ఓటిటీ రైట్స్ అమ్ముడుపోలేదు, ఇప్పుడు ఈ చిత్రం ఏ ఓటిటీ నుంచి వస్తుందో అని ప్రచారం మొదలు కాగానే.. ఈగల్ డిజిటల్ హక్కులు ఈటివి విన్ దక్కించుకుంది అని ఓసారి, మరోసారి ఈగల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది అని మరోసారి మేకర్స్ ప్రకటించారు. మరి ఏ ఓటిటిలో ముందు ఈగల్ ఆడియన్స్ ముందుకు వస్తుందో అనుకుంటే.. అమెజాన్ ప్రైమ్ వారు ఈగల్ థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేసారు.
అంతేకాదు ఈటివి విన్ వారు కూడా ఈగల్ మార్చ్ 1 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ తో సహా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ లో, ఈటివి విన్ లో ఈగల్ చిత్రం మార్చి 1 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. మరి మరీ సైలెంట్ గా కాకుండా రెండు రోజుల ముందే ఓటిటీ ఆడియన్స్ ని అమెజాన్ ప్రైమ్ అలాగే ఈటివి విన్ వారు అలెర్ట్ చేశారు.