తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల స్పీచ్ కి టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు పూనకాలతో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ తో తాడేపల్లి గూడెం సభ దద్దరిల్లిపోయింది. పవన్ స్పీచ్ హైలైట్స్..
సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇద్దాం, అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు, మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభ, ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి, ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు, వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు, మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడి చేస్తే మక్కెలు విరగ్గొడతాం, తాను ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు, నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు.. రాష్ట్ర లబ్ధి కోసమే ఉంటాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాలు చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పొత్తులు పెట్టుకున్నాం అంటూ పవన్ స్పీచ్ కొనసాగించారు.
టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, జూబ్లీహిల్స్ ఫాంహౌస్ లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతుకు నాకు తెలుసు, జగన్.. ఇప్పటి వరకు పవన్ తాలూకా శాంతినే చూశావు, జగన్.. ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు , మిగతా పార్టీలకు నేను నిలబడకపోతే జనసైనికుల కోసం ఎవరూ రారు, అందు కోసమే కూటమిని నేనే ప్రతిపాదించా, 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం, ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చాను, రెండు చోట్ల ఓడిపోయాననే నిరాశ నాలో ఉంది, కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకుని వచ్చా, జగన్ ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు.
ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా.. కోట కూడా కడతాం, జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాం, సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. యుద్ధం చేసేవాళ్లు కావాలి, యుద్ధం చేస్తేనే జగన్ కూలిపోతారు, ఓట్లు తీసుకువచ్చేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు అంటూ జనసైనికుల్లో ఊపు తీసుకొచ్చారు. పవన్ అంటే ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ, పవన్ అంటే జగన్ ను నట్టేట ముంచే తుపాను, పవన్ అంటే జగన్ అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం, ఒక్కడి ప్రతిఘటన కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుంది, వైసీపీ దుష్ట పాలనపై ప్రజలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు.
మినీ యుద్ధాలన్నీ కలిసి మహా యుద్ధాన్ని ప్రకటిస్తున్నా, మహా యుద్ధానికి శంఖారావం పలుకుతున్నా, వైసీపీ విధ్వంస పాలన ఆపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది, వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన కూటమి రావాలి అంటూ పవన్ ఆ సభలో మాట్లాడారు.