రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ నచ్చిన వాడితో గోవాలో ఏడడుగులు నడిచింది. జాకీ భగ్నానీ చేత మూడు ముళ్ళు వేయించుకున్న రకుల్ ప్రీత్ పెళ్లి ఫొటోస్ ఇంకా ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇంతలోపులో మరో హీరోయిన్ పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో కనిపించింది. ఆమె ఎవరో కాదు సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి, హిందీలో బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తున్న తాప్సి. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న తాప్సి పెళ్ళికి సిద్దమవుతుంది అనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చింది.
గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్ మథియెస్ భోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, వెకేషన్స్ కి వెళ్లినా తమ డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా దాచేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కాని గత ఏడాది తమ రిలేషన్ షిప్ గురించి అందరికి చెప్పేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలెలేసుకుని తిరుగుతూ కనిపించడమే కాదు ఇప్పుడు పెళ్ళికి సిద్దమయ్యారనే న్యూస్ మొదలయ్యింది. సెలబ్రేటిస్ పెళ్ళిళ్ళకి కేరాఫ్ గా నిలుస్తున్న ఉదయ పూర్ కోట లోనే తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు నడిచేందుకు డిసైడ్ అయినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
తాప్సి తన పెళ్లికి కేవలం ఫ్యామిలీ మెంబెర్స్, అతికొద్దిమంది సన్నిహితులని మాత్రమే ఇన్వైట్ చేస్తుంది అని సమాచారం. మరి ప్రేమని దాచేసినట్టుగానే, పెళ్లి విషయంలోనూ తాప్సి సీక్రెట్ ని మైంటైన్ చేసేలా కనిపిస్తోంది.