Advertisement
Google Ads BL

పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదట


చాలామంది హీరోయిన్స్ వయసు మీదపడుతున్నా పెళ్లిపై అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. పెళ్లి చేసుకుంటే కెరీర్ ఎక్కడ మరుగున పడిపోతుందో అని అలోచించి పెళ్లి పేరు ఎత్తడానికి భయపడతారు. కొంతమంది కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంటారు. కానీ పిల్లలని కనడానికి తటపటాయిస్తారు. మరికొందరు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని పెళ్లి చేసుకుని, పిల్లలని కనేసి కెరీర్ ని కంటిన్యూ చేస్తారు. అలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఓ హీరోయిన్ తనకి పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదు అంటుంది. 20 నుంచి 25 మధ్యలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కలలు కన్నాను. కానీ ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి. పెళ్లి అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించడం లేదు అంటూ సంచలనంగా మాట్లాడింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఆండ్రియా. ఒకప్పుడు హీరోయిన్ గా ప్రస్తుతం నెగెటివ్ కేరెక్టర్స్ లో కనబడుతున్న ఆండ్రియా రీసెంట్ గా వెంకటేష్ మూవీలో నటించింది. ఈమెని పెళ్ళెప్పుడు చేసుకుంటారు అనగానే.. పెళ్లి చేసుకుని ఎంతమంది సంతోషంగా ఉన్నారు.

నాకు ఒకప్పుడు అంటే 20, 25 ఏళ్ళ వయసుకున్నప్పుడు పెళ్లి  చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కాని కుదర్లేదు, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ కుండబద్దలు కొట్టింది. పెళ్లి చేసుకోకపోయినా తాను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పటికి అలానే ఉంటాను. తాను సింగిల్ లైఫ్ కి అలవాటు పడిపోయాను. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు, అసలు ఆ ఆలోచన కూడా లేదు అంటూ ఆండ్రియా పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.  

Andrea Reveals That She Is Not Marrying Permanently:

Andrea Jeremiah Reveals That She Is Not Marrying Permanently
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs