మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా.. ఆమె మాత్రం సోషల్ మీడియా క్వీన్. సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేసే పిక్స్ తోనే ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారని ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే మాళవిక మోహనన్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. కోలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్న మాళవిక మోహనన్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
తాజాగా ఆమె ఓ ఫంక్షన్ కి హాజరవగా.. అక్కడ తీసుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కమ్ మోడ్రెన్ లుక్ లో చాలా అంటే చాలా అందంగా, రాయల్ గా కనిపించింది. క్రేజీ లుక్ లో యూత్ మతిపోగొట్టేసింది. లైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో మాళవిక ఏంజిల్ లా మెరిసిపోయింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.