Advertisement
Google Ads BL

ఆస్తులమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్


బ్రేకింగ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆయన లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఉన్న ఓ స్థలం అమ్మేసారు, ఇంకో రెండు స్థలాలు కూడా అమ్మకానికి పెట్టారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు అవాక్కవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమిటి, ఆస్తులు అమ్ముకోవడం ఏమిటి అంటూ షాకవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఇలాంటి గొప్ప వ్యక్తిని ఈ 420 పార్టీ మరియు దాని అధినాయకుడు ప్యాకేజీ స్టార్ అని సంబోధిస్తారు🙏

Advertisement
CJ Advs

ఎలక్షన్ కోసం 100 కోట్లు సమీకరణ దిశగా ఆస్తుల అమ్ముతున్న పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏😥😥😥, కార్యకర్తల ఆకలి తీర్చేందుకు పవన్ ఆస్తులు అమ్మేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. జనసేన పార్టీని నడిపించాలంటే ఎంతోకొంత డబ్బు అవసరం, తమతో పాటుగా తిరిగే కార్యకర్తలని చూసుకోవాలంటే డబ్బు కావాలి, అందుకే పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్మేస్తున్నారని అంటున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించాలంటే డబ్బు కావాలి అందుకే సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే.

ఎన్నికల ఖర్చుల కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది, ఈ మధ్యనే పవన్ హైదరాబాద్‌లో ఒక ఖరీదైన స్థలాన్ని అమ్మేశాడట. ఇంకో రెండు మూడు ఆస్తులను కూడా ఆయన అమ్మకానికి పెట్టినట్లు టీవీ ఛానెళ్లలో స్క్రోలింగ్స్, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ కనిపిస్తున్నాయి. ఈలెక్కన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చూపించాలే కసితో కనిపిస్తున్నారు అంటూ జనసైనికులు నమ్మకాన్ని కూడబెట్టుకుంటున్నారు.

Pawan Kalyan Selling His Properties In Hyderabad:

Pawan Kalyan Sells House and His personal assets for Andhra Pradesh Elections 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs