జబర్దస్త్ చేస్తూ రాజకీయాల్లో టీడీపీ వాళ్ళని తిడుతూ తెగ హైలెట్ అయిన రోజాకి జగన్ గారు పిలిచి పర్యాటక శాఖా మంత్రిపదవిని కట్టబెట్టారు. దానితో రోజా మరింతగా రెచ్చిపోయి టీడీపీ వాళ్లపై, జనసేన నేత పవన్ కళ్యాణ్ పై చెత్త మాట్లాడుతుంది. అయితే జబర్దస్త్ చేస్తున్నప్పుడు మంత్రిగా ఉంటే తనపై అపవాదు వస్తుంది అందుకే తాను జబర్దస్త్ మానేస్తున్నట్టుగా చెప్పిన రోజాని ఇప్పుడు నటుడు బండ్ల గణేష్ రోజా ఐటెం రాణి, పులుసు పాప అంటూ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపించే బండ్ల గణేష్ ఈమధ్యన ఓ ప్రాపర్టీ విషయంలో జైలుకెళ్ళొచ్చాడు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బండ్ల గణేష్ యాక్టీవ్ అయ్యాడు. అయితే రీసెంట్ గా రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించడం పట్ల బండ్ల గణేష్ ఘాటుగా స్పందించాడు. రోజా ఒక రోజా ఐటెం రాణి అని.. రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని, ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం, రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అంటూ పదునైన వ్యాఖ్యలు చేసాడు.
మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఎలా రియాక్ట్ అవుతారో అంటూ నెటిజెన్స్ ఎదురు చూస్తున్నారు.