మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాదు, పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఆయన భార్య నమ్రత మహేష్ బాబు మల్టిప్లెక్స్ బాధ్యతలతో పాటుగా, రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంటర్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆసియన్ సునీల్ తో భాగస్వామిగా మహేష్ బాబు పలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హైదరాబాద్ కాస్ట్లీ ప్రాంతమైన కొండాపూర్ లో AMB మల్టిప్లెక్స్ ని స్థాపించారు. అది బాగా సక్సెస్ అవడంతో మహేష్ ఇప్పుడు మరో మల్టిప్లెక్స్ ని నిర్మించడానికి రెడీ అవుతున్నారట.
అది RTC క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ని మహేష్ బాబు AMB క్లాసిక్ మల్టిప్లెక్స్ గా మార్చబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నామధ్యన వెంకటేష్ తో కలిసి ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది అన్నప్పటికీ.. ప్రస్తుతం మహేష్ ఒంటరిగానే దీనిని మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి సుదర్శన్ 70 ఎంఎం అంటే RTC క్రాస్ రోడ్స్ లో క్రేజీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఆ థియేటర్ ఎంతగా పాతదైనా అక్కడ రిలీజ్ రోజున సినిమాలు చూడడం అనేది స్టార్ హీరోల అభిమానులకి నచ్చే విషయం.
మరి ఇప్పుడు ఆ సుదర్శన్ 70 ఎంఎం సింగిల్స్ స్క్రీన్ థియేటర్ స్థానంలో AMB క్లాసిక్ మల్టిప్లెక్స్ థియేటర్ రావడం అభిమానులకి చెప్పలేని సంతోషమే అయినా.. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కొత్త సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులకి మాత్రం కాసింత నిరాశ పరిచే విషయమే అయినా.. మల్టిప్లెక్స్ కల్చర్ అలవాటు పడి అందరూ దానికే సై అంటున్నారు.