హీరో నాని, శర్వానంద్ లతో నటించి తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ దక్కించుకుని క్రేజీ హీరోయిన్ గా మారిన ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు తమిళంలోనూ ఫుల్ బిజీ హీరోయిన్ అయ్యింది. అక్కడ స్టార్ హీరోస్ తో జోడి కడుతుంది. తెలుగులో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో తెరకెక్కుతున్న OG చిత్రంలో పవన్ పక్కన ప్లేస్ కొట్టేసి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేని ప్రియాంకకి OG లో ఆఫర్ రావడం చూసి మిగతావాళ్ళు ఆమె అదృష్టానికి కుళ్ళుకున్నారు.
తాజాగా ప్రియాంక మోహన్ OG సినిమాపై అలాగే పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఒక లెజెండ్, అమేజింగ్ హ్యుమన్, మరియు గ్రేట్ లీడర్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది.అంతేకాకుండా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ చాలా బాగా వస్తుంది అని, మీరంతా ఆ మ్యాజిక్ ను స్క్రీన్ పై విట్ నెస్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ ప్రియాంక అరుళ్ మోహన్ OG పై పవన్ పై చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.
OG చిత్రాన్ని దానయ్య సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నట్టుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రెండు మూడు వారాల పాటు షూటింగ్ లో పాల్గొంటే OG లో పవన్ పార్ట్ పూర్తవుతుంది అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ పూర్త కాగానే OG షూటింగ్ మళ్ళీ సెట్స్ మీద కొచ్చేస్తారు.