Advertisement
Google Ads BL

ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయా: రష్మిక


రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా సౌత్ లో సూపర్ హిట్స్ కొట్టి ప్యాన్ ఇండియా లెవల్లో పుష్ప తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా.. ఆమెకి నార్త్ మాత్రం రెండుమూడు షాకులిచ్చింది. ముంబై, హైదరాబాద్ అంటూ షూటింగ్స్ తో అలిసిపోయిన రశ్మికకి హిందీలో యానిమల్ చిత్రం బిగ్ హిట్ ని కట్టబెట్టింది. సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసిన రశ్మికకి ఈ చిత్రం సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు రశ్మిక నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం దాదాపుగా 900 కోట్లు కొల్లగొట్టింది. యానిమల్ విడుదలకు ముందు రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ ని అన్ని భాషల్లో తెగ ప్రమోట్ చేసిన రష్మిక యానిమల్ సక్సెస్ తర్వాత పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. యానిమల్ విజయం పట్ల రష్మిక ఎక్కడా ఓ ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోవడంపై జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఫైనల్లీ రష్మిక యానిమల్ విజయం పై ఇన్నాళ్ళకి స్పందించింది.

మేము భారీ చిత్రాన్ని ఇచ్చాము, ప్రేక్షకులు అందుకు తగ్గట్టుగా విజయాన్ని అందించారు. కానీ నేను ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. ఆ విజయాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను, కానీ యానిమల్ విడుదలయ్యాక నేను మరో సినిమా షూటింగ్ లో బిజీగా మారాను. అందుకే నేను యానిమల్ ఇంటర్వూస్, పార్టీలు, సక్సెస్ మీట్స్ లో కనిపించలేదు. షూటింగ్ కోసం రాత్రిబవళ్ళు ప్రయాణం చెయ్యాల్సివచ్చింది. అందుకే ఇలా యానిమల్ విజయంపై స్పందించలేకపోయా అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. 

Rashmika reveals why she didn't take ownership of Animal success:

Rashmika Mandanna reveals why she didn't take ownership of Animal success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs