ఎంత పెద్ద గొడవలున్నా, ఫ్యామిలిలో విభేదాలున్నా.. అన్నా చెల్లెల్లు ఒకరి ఫంక్షన్ కి మరొకరు హాజరవకపోవడం అనేది పెద్ద పెద్ద కుటుంబాల్లో పెద్ద సెన్సేషన్ అవుతూ ఉంటుంది. అదే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంభంలో జరిగింది. అన్నకి తోడుగా నీడగా నిలిచిన వైస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్ళిలో సీఎం జగన్ కనిపించకపోవడమే సంచలనం అయ్యింది. హైదరాబాద్ లో జరిగిన షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కి హాజరైన జగన్.. పెళ్ళికి, రిసెప్షన్ కి రాకపోవడం విడ్డురమే. అన్నకి వ్యతిరేఖంగా మాట్లాడుతుంది అని చెల్లమ్మనే పక్కనబెట్టిన అన్న జగన్ అంటూ ఏపీ ప్రజలు కామెడీగా మాటాడుతున్నారు.
రీసెంట్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టిన షర్మిల అన్న జగన్ పై విరుచుకుపడుతుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మీడియాలో హడావిడి చేస్తుంది. అందుకేనేమో జగన్ మేనల్లుడు పెళ్ళికి రిసెప్షన్ కి వెళ్లి మొహం చూపించలేకపోయారు. పాపం చెల్లెలు షర్మిలకు భయపడిన జగన్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పోనీ రాజస్థాన్ పెళ్ళికి అధికారిక కార్యక్రమాలతో వెళ్లలేకపోతే.. హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ కి అయినా వెళ్లాల్సిందిగా.. మరి హైదరాబాద్ కి కూడా రాలేని అంత బిజీ ఏమిటో జగన్ కి.
ఏది ఏమైనా షర్మిల-జగన్ మధ్యన ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది వ్యవహారం. చెల్లని డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యకుండా తన చెంచా గాళ్లయిన సజ్జల, రోజాల లాంటి వాళ్లతో టార్గెట్ చేపిస్తూ షర్మిలని నానా మాటలనిపిస్తున్న జగన్ పై షర్మిలకి పీకల దాక ఉంది అనేది ఆమె మీడియా ముందు చేస్తున్న కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఇదంతా మనసులో పెట్టుకునే మేనల్లుడు రాజారెడ్డి వివాహానికి, రిసెప్షన్ కి హాజరవలేదేమో జగన్ అంటూ గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.