Advertisement
Google Ads BL

పారితోషకం అమాంతం పెంచేసిన కుర్ర హీరో


చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన తేజ సజ్జా హీరోగా మారి ఇప్పుడు హనుమాన్ తో ప్యాన్ ఇండియా స్టార్ అవతారమెత్తాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించడంతో తేజ సజ్జ పేరు మీడియాలో మార్మోగిపోయింది. మరి ఒక్క హిట్టు హీరోల కెరీర్ లని మలుపుతిప్పేస్తుంది అన్నట్టుగానే హనుమాన్ విజయం తేజ సజ్జ కెరీర్ ని మలుపు తిప్పినట్టే అనిపిస్తుంది. 300 కోట్లు కొల్లగొట్టిన హనుమాన్ లో హీరో తేజ కావడంతో తేజ సజ్జతో సినిమాలు చేసునేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.

Advertisement
CJ Advs

అంత పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న తేజ సజ్జ ఊరికే ఉంటాడా.. అందుకే తన దగ్గరకి వచ్చే నిర్మాతలకు తన పారితోషకం చెప్పి షాకిస్తున్నాడట. ప్రస్తుతం అందుకుంటున్న పారితోషకాన్ని డబుల్ కాదు త్రిబుల్ చేసాడట ఈ కుర్ర హీరో. ఇప్పటివరకు కోటి వరకు అందుకుంటున్న తేజ.. ఇకపై ఐదు కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడనే టాక్ మొదలైంది. అయినా పర్లేదు తేజ సజ్జ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లుగా తెలియడం కాదు.. ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చి తేజ సజ్జని బుక్ చేసుకుంటున్నారట.

ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టేటస్ తెచ్చుకున్న తేజ సజ్జాతో హిందీ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే ఈ కుర్ర హీరో పారితోషకం అమాంతం పెంచేసాడంటున్నారు.

Teja Sajja Huge Hike In Remuneration After Hanu-Man:

Teja Sajja Teases Considerable Hike In His Salary Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs