Advertisement
Google Ads BL

గొడవల్లేకుండా విడాకులెందుకు తీసుకున్నట్లు


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాకి విడాకులిచ్చి కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ సినిమాల విషయమైనా ఏదైనా కలిసి కనిపించేవారు, అన్యోన్యంగా ఉండేవారు. కానీ అమీర్ ఖాన్ - కిరణ్ రావు లు 2021 ల విడాకులు తీసుకుని విడిపోవడంతో అందరూ షాకయ్యారు. వీరి మధ్యన గొడవలొచ్చాయేమో అందుకే వీరు విడిపోయారనుకున్నారు. వీరికి సరోగసి ద్వారా ఓ బాబు కూడా ఉన్నాడు. విడాకులయ్యాక కూడా వీరిద్దరూ ఫ్రెండ్లి గానే కనిపిస్తున్నారు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కుమర్తె పెళ్లిలోనూ కిరణ్ రావు సందడి చేసింది.

Advertisement
CJ Advs

అయితే అమీర్ ఖాన్ తో తనకి ఎలాంటి గొడవలు లేవు, అసలు మేమిద్దరం ఎప్పుడూ గొడవపడేవాళ్ళం కాదు అంటూ కిరణ్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నేను నా మాజీ భర్త తో చాలా బాగుంటాను, మా కొడుకు కోసం కలుస్తూనే ఉంటాము. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి, ఆ బంధం కోసం పోరాటం చెయ్యాలి అంటారు. నేను కూడా కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేశాను. కానీ మేము ఎప్పుడూ గొడవపడేవాళ్ళం కాదు, అభిప్రాయం భేదాలు వచ్చేవి.. కానీ ఎప్పుడూ గొడవ పడలేదు. 

మేము ఒకరినొకరం గౌరవించుకుంటాం, ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటాము, అల్లకల్లోలానికి దారి తీసే గొడవలేమి మా మధ్యన జరగలేదు, అర్ధం చేసుకుంటాం కాబట్టే గొడవలు జరగలేదేమో, మా మధ్యన ఉన్న అనుబంధం అలాంటిది అంటూ కిరణ్ రావు చేసిన కామెంట్స్ చూసి మరి ఎందుకు మీరు విడిపోయారు, గొడవలు లేకుండా డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అంటూ నెటిజెన్స్ కూడా అడుగుతున్నారు.

Kiran Rao never really fought with Aamir Khan:

Kiran Rao says she never had big fights with ex-husband Aamir Khan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs