Advertisement
Google Ads BL

దిల్ రాజు ఇంటి వేడుకలో కనిపించని స్టార్స్


టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ గా బడా నిర్మాతగా మారిన దిల్ రాజు తో టాలీవుడ్ లో సినిమా చెయ్యని హీరో లేరనే చెప్పాలి. ఆయన కాంబినేషన్ లో సినిమాలు చెయ్యని హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. మరి ఇండస్ట్రీలో అందరికి కావల్సిన వాడిగా ఉన్న దిల్ రాజు ఇంట శుభకార్యం జరిగితే దానికి సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున హాజరు కాకుండా ఉంటారా.. అస్సలుండరు. కానీ దిల్ రాజు సోదరుడు కొడుకు హీరో ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువగా కనిపించకపోవడమే అందరికి ఆశ్చర్యమేసింది.

Advertisement
CJ Advs

దిల్ రాజు తన సోదరుడి కుమారుడి వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం రేవంత్ వరకు మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మాజీ సీఎం కేసీఆర్ ఇలా అందరికి ఆహ్వానాలు అందించారు. అందరి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆశిష్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇన్వైట్ చేసాడు. ఆశిష్ - అద్వైతల వివాహం రాజస్థాన్ లో చేసిన దిల్ రాజు రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో గత శుక్రవారం రాత్రి నిర్వహించారు. మరి ఈ రిసెప్షన్ లో తారల సందడి ఉంటుంది అనుకుంటే.. స్టార్స్ చాలా తక్కువగా దర్శనమిచ్చారు.

అందులో రామ్ చరణ్ సింగిల్ గా దిల్ రాజు ఫంక్షన్ కి హాజరు కాగా.. నాగార్జున కొడుకు చైతూతో కలిసి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రామ్, నాని లాంటి యంగ్ హీరోస్, మహేష్ తరపున ఆయన సతీమణి నమ్రత వచ్చారు. ఇక హీరోయిన్స్ లో రష్మిక, శ్రీలీల కనిపించగా.. ఈవేడుకలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్, బాలయ్య లాంటి స్టార్స్ కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకి వారు ఈ ఈవెంట్ లో కనిపించకపోవడం డిస్పాయింట్ చెయ్యడం కాదు షాక్ అయ్యేలా చేసింది. మరి దిల్ రాజు ఇంట వేడుకకి స్టార్స్ ఎందుకు రాలేకపోయాయారో అని గుసగుసలు స్టార్ట్ అయ్యాయనుకోండి. 

Dil Raju nephew Ashish Reactions: Why Did Stars Avoid?:

Celebrities at Ashish and Advitha Wedding Reception
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs