నందమూరి వారసుడు, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, బాలయ్య మాత్రం మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే విషయంలో ఎప్పుడు ముహూర్తం పెట్టబోతున్నారో అని ప్రతి ఫెస్టివల్ కి ఎదురు చూడడం, ఆ తర్వాత అభిమానులు డిస్పాయింట్ అవడం చూస్తున్నాం.
ఇక మోక్షజ్ఞ లుక్ విషయంలోనూ నిన్నమొన్నటివరకు ఫాన్స్ లో ఆందోళన ఉన్నా.. ఈమధ్యన మోక్షజ్ఞ మేకోవర్ విషయంలో తృప్తి చెందుతున్నారు. మోక్షజ్ఞ మెల్లగా హీరో లుక్ లోకి మారిపోతున్నాడు. తాజాగా మోక్షజ్ఞ నయా లుక్స్, కటౌట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మోక్షజ్ఞ బరువు తగ్గి అచ్చం హీరోలా తయారయ్యాడు. ఈ మార్పు మొత్తం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసమే అంటూ నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. మోక్షజ్ఞ రీసెంట్ గా తన తండ్రి బాలకృష్ణ తో కలిసి విశాఖపట్నం టీడీపీ నేత మతుకుమిల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు.
పెళ్ళిలో మోక్షజ్ఞ తన తండ్రితో కలిసి సందడి చేసిన ఫోటోలు బయటకి వచ్చాయి. ఈ పెళ్ళికి మోక్షజ్ఞ వైట్ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి అచ్చం హీరో లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ లుక్ తో హీరోగా ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదు.. అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.