జనసేన పార్టీ పెట్టి గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో పోరాడుతున్నాడు. మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ లు ఫీల్డ్ లోకి దిగకపోయినా.. పవన్ కళ్యాణ్ కే తమ మద్దతు అని చెప్పారు. ఇక నాగబాబు సినిమాలు, నటనని పక్కనబెట్టి తమ్ముడి జనసేన కోసం కష్టపడుతున్నాడు. మరోపక్క వరుణ్ తేజ్, నిహారిక వీళ్లంతా తమ బాబాయికి అండగా ఉంటామని ఎప్పుడో చెప్పారు. గత ఏడాది మెగా డాటర్ నిహారిక విడాకులు మెగా ఫ్యామిలిలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆ తర్వాత నిహారిక నటనలోకి, అలాగే నిర్మాతగా మారిపోయింది.
తాజాగా నిహారిక రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతుంది. జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేసే ఆస్కారం ఉంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నిహారిక పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వున్న వరుణ్ తేజ్ ని మీడియా ప్రశ్నిస్తుంది. తాజాగా రాజమండ్రిలో వరుణ్ తేజ్ ని మీడియా వారు నిహారిక పొలిటికల్ ఇంటిపై స్పందించమని కోరారు.
వరుణ్ తేజ్.. నిహారిక పొలిటికల్ ఎంట్రీ పై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసాడు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి తాము రావాలా.. వద్దా.. అనేదానిపైనా తమ ఇంటి పెద్దలు నిర్ణయిస్తారని, పెదనాన్న చిరంజీవి, నాగబాబు, జననేత పవన్ కల్యాణ్ తమను నిర్ధేశిస్తారని చెప్పాడు.. అలాగే మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్ వెంటే ఉంటుందని వరుణ్ తేజ్ స్పష్ఠం చేసాడు.