యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఈరోజు గంజాయి కేసులో అరెస్ట్ అవడం, షణ్ముఖ్ తమ్ముడు సంపత్ వినయ్ అమ్మాయిని చీట్ చేసిన కేసులో అరెస్ట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ పై ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసు మొదలయ్యింది. సంపత్ వినయ్ విషయంలో సంచలన విషయాలు బాధితురాలు మౌనిక పోలిసుల ముందు వెల్లడించింది.
యూట్యూబర్ షణ్ముఖ్ షార్ట్ ఫిలింలో నాకు పరిచయం అయ్యాడు.. షణ్ముఖ్ తమ్ముడు సంపత్ ను నాకు యూట్యూబర్ షణ్ముఖ్ పరిచయం చేసాడు.. ఆ పరిచయాన్ని ప్రేమాగా మార్చి సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని నిశ్చితార్ధం అయినట్లుగా నమ్మించాడు సంపత్ వినయ్.
ఆ తర్వాత పలుమార్లు శారీరకంగా నన్ను వాడుకున్నాడు..హోటల్స్, విల్లాస్ లో కి తరచూ తీసుకెళ్లేవాడు.. చాలాసార్లు మెజిస్టిక్ విల్లాస్ కి తీసుకెళ్లేవాడు సంపత్ వినయ్.. అంతేకాకుండా 2018 లో నాకు ప్రెగ్నెన్సీ రావడంతో అబార్షన్ చేయించాడు.. ఈ విషయం సంపత్ తండ్రి అప్పారావు కి చెప్పాను.. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు ఫిజికల్ గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో పెడతామని వారు బెదిరించారు.. అంటూ మౌనిక పోలీస్ ల ఎదుట సంపత్ వినయ్ పై సంచలన విషయాలను బయటపెట్టింది.
ఇక సంపత్ వినయ్ ని అరెస్ట్ చేసేందుకు అతను ఉంటున్న ప్లాట్ దగ్గరకి వెళ్లగా.. అక్కడ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా పట్టుబడడమే కాకుండా అతని దగ్గర గంజాయి, డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో సంపత్ ని షణ్ముఖ్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.