Advertisement
Google Ads BL

వైసీపీ-టీడీపీ మధ్య యుద్ధం!


చీ.. ఛీ.. ఇంత దిగజారుతున్నారేంట్రా బాబు!

Advertisement
CJ Advs

వైసీపీ వారికి ప్రచార పిచ్చి పీక్స్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ మరి ఇంతనా? ఒక హద్దంటూ ఉండక్కర్లే. ఒకప్పుడు వైసీపీ రంగులు కనబడిన చోటల్లా అద్దేవారు. చివరకు శ్మశానాన్ని సైతం వదల్లేదు. ఇక టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు సైతం వైసీపీ రంగులద్ది మరీ అప్పగించారు. ఇలా చెప్పుకుంటే పోతే వైసీపీ వారి ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ఇక వైసీపీ చేపట్టిన వింత వింత కార్యక్రమాలు కూడా ఎక్కువే. ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘గడప.. గడపకూ’ వంటి కార్యక్రమాలెన్నో చేపట్టారు. అన్నింటిలోనూ జగన్ గురించి ప్రచారం పీక్స్‌లో ఉంటుంది. అసలు ఈ ఐడియాలు ఎలా వస్తాయిరా బాబోయ్ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే..

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు..!

ఇక తాజాగా సిద్ధం సభ ప్రచారం గురించి జగన్ సైన్యం ప్రచారం ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు. కొన్ని పాకెట్స్ పై ‘సిద్ధం’ పేరును ముద్రించారు. ఇక ఆ ప్యాకెట్‌పై వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను సైతం ముద్రించారు. అలాగే ఆ ప్యాకెట్‌పై వైసీఎస్సార్‌సీపీ అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అని నోరెళ్లబెడుతున్నారు. సిద్ధం సభను హైలైట్ చేసుకనే విధానం ఇదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ చెప్పే మాటలేమో ఓ రేంజ్‌లో ఉంటాయి. చేసే పనులేమో ఇలా ఉంటాయి. అయితే ఇదంతా టీడీపీ చేస్తున్న బోగస్ ప్రచారమేనని.. వైసీపీ కౌంటర్ ఇస్తోంది. పనిలో పనిగా సిద్ధం పేరిట టీడీపీ ఎలా చేస్తోందో.. వైసీపీ కూడా అంతకుమించి ‘రా కదలిరా..’, ‘శంకారావం’ పేరిట ఇలా కూడా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. టీడీపీ-వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. 

ఇంత అరాచకమేంటి?

సిద్ధం పేరిట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సభలకు ఫలానా మీడియా ఛానళ్ల వారు మాత్రమే రావాలి.. వీళ్లు రాకూడదన్న రూల్ పాస్ చేసి ఉంటే.. డప్పు కొట్టేవారు మాత్రమే వెళ్లి ఉండేవారు. కానీ అలాంటిదేమీ చేయకుండా తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న కోపంతో ఓ మీడియా ఛానల్‌కు చెందిన ఫోటో గ్రాఫర్‌పై వైసీపీ అనుచరులు చేసిన దాడితో అంతా నివ్వెరబోయారు. ఇంత అరాచకమేంటని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి ఇప్పుడు ఎక్కడ ఓటమి పాలవుతామోనన్న భయం పట్టుకుంది. అందుకే డప్పు కొట్టే మీడియా ఛానళ్ల వారిని మాత్రమే అనుమతిస్తోంది. లోపాలను ఎత్తి చూపేవారిని ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదు. అలాగే సిద్ధం కార్యక్రమం ప్రచారంలో భాగంగా పైన చెప్పుకున్న పనికిమాలిన పనులు కూడా చేస్తోంది.

YCP vs TDP:

Jagan vs Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs