కామినేని వారి ఆడపడుచుగా అపోలో ఆసుపత్రి బాధ్యతలని నిర్వర్తిస్తూ.. మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల.. గత ఏడాది జూన్ లో పండంటి పాపకి జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలికి వారసురాలిని అందించింది. రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి చేసుకున్న పదకొండేళ్ల తర్వాత పాప క్లింకారకి జన్మనిచ్చారు. తన పాపని మీడియాకి కనిపించకుండా దాచేసినా.. వెకేషన్స్ లోను, ఫ్యామిలీ ఈవెంట్స్ లోను పాపతో కలిసి ఎంజాయ్ చేస్తుంది ఈ జంట.
చాలా ఏళ్ళ తర్వాత మెగా అభిమానులని సంతోషంలో ముంచెత్తిన ఉపాసన-చరణ్ లు త్వరలో మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పి అభిమానులని మరింత సంతోషపెట్టింది. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించింది. మనల్ని మనమే శ్రద్ద తీసుకోవాలి.
మనం కాకపోతే మన గురించి ఇంకెవరు పట్టించుకుంటారు.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఉపాసన వివరించింది. మరి ప్రస్తుతం క్లింకారకి జన్మనిచ్చిన ఉపాసన ఈసారి మెగా వారసుడికి జన్మనివ్వాలని.. అప్పుడే మెగా అభిమానులు దేవుడిని కోరుకుంటున్నారు.