Advertisement
Google Ads BL

బాలయ్యా.. ఈ స్పీడ్ ఏందయ్యా!


నందమూరి బాలకృష్ణ కొన్నేళ్లుగా ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తున్నారు. సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీ కోసం టాక్ షో కూడా చేసి ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు. మార్కెట్ పరంగా తన క్రేజ్ పెరగడంతో ఆయన పలు ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. వరసగా హ్యాట్రిక్ హిట్స్‌తో ఉన్న బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. వీరి కలయికలో NBK109 షూటింగ్ మొదలైనప్పటి నుంచి చిన్నపాటి బ్రేక్ తీసుకోకుండా బాలయ్య షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బావ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా అక్కకి అండగా ఉంటూనే ఆయన షూటింగ్‌కి హాజరయ్యారు.

Advertisement
CJ Advs

ఎట్టిపరిస్థితుల్లోనూ NBK109 షూటింగ్ ఏపీ ఎన్నికల ముందు ముగించాలనే నిశ్చయంతో ఆయన ఉన్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు, అందుకే బాలయ్య ఇప్పుడు షూటింగ్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బాలయ్య ఇక్కడ NBK109 షూటింగ్‌కి బ్రేకిచ్చేసి రాజకీయాల్లో బిజీగా మారుతారని ఆ న్యూస్ సారాంశం. తాను MLA గా ఎన్నికల్లో పాల్గొంటున్నందున ఎన్నికల నోటిఫికేషన్ రాగానే షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది.

కానీ బాలకృష్ణ-బాబీ చిత్రానికి ఎటువంటి బ్రేకులు పడవని, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే అంటే మార్చి మొదటి వారంలోనే NBK109 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.. బాలయ్య షూటింగ్ కంప్లీట్ చేసి ఎన్నికల కోసం రెడీ అవుతారని, ఈలోపు బాబీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలవుతారని సమాచారం. బాలయ్య మళ్ళీ ఫ్రీ అయ్యాకే సినిమా రిలీజ్ పెట్టుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి భగవంత్ కేసరి వచ్చిన ఆరు నెలల లోగా బాలయ్య మరో సినిమా కంప్లీట్ చెయ్యడం చూసిన ఆయన అభిమానులు బాలయ్యా.. నీ స్పీడుని మ్యాచ్ చెయ్యలేరయ్యా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Nata Simham Balayya Speed Creates Sensation:

Balakrishna Planning for Shootings and Elections Revealed <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs