Advertisement
Google Ads BL

మెగాస్టార్ విశ్వంభరలో మరో హీరోయిన్


మెగాస్టార్ చిరంజీవి సరసన అవకాశం వస్తే కుర్ర హీరోయిన్స్ సైతం గెంతులేసి మరీ ఒప్పేసుకుంటారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరు వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం ఉంది. ఇప్పటికే టాప్ హీరోయిన్ త్రిష విశ్వంభర సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు శర్వానంద్, నాని ల సినిమాల్లో నటించిన సురభి. శర్వానంద్ తో ఎక్స్ప్రెస్ రాజా, నానితో జెంటిల్మన్ చిత్రాల్లో నటించిన సురభి.. విశ్వంభరలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సురభి  ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది అని.. ఇప్పటికే సురభి విశ్వంభర సెట్స్ లో అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. చిత్ర బృందం త్వరలోనే సురభి విషయంలో అధికారిక ప్రకటన ఇవ్వనుంది అని సమాచారం. 

భోళా శంకర్ తర్వాత చిరు ఆచితూచి వసిష్ఠని దర్శకుడిగా ఎంపిక చేసుకుని లాంగ్ గ్యాప్ తో సెట్స్ లోకి వచ్చారు. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో మెగాస్టార్ ఉన్నారు.

Young Beauty in Vishwambhara:

Surbhi to join the cast of Chiranjeevi Viswambhara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs