Advertisement
Google Ads BL

నెల తిరక్కుండానే ఓటిటిలోకి సూపర్ స్టార్ చిత్రం


సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కోసం చేసిన త్యాగాలు వృధా అవుతున్నాయి. గతంలోనూ రజినీకాంత్ తన కూతురు డైరెక్షన్ లో నటించారు. అది డిసాస్టర్ అయ్యింది. తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన లాల్ సలాం లో గెస్ట్ రోల్ చేసారు. సూపర్ స్టార్ అతిధి పాత్ర ఆ చిత్రానికి హెల్ప్ అవ్వకపోగా.. ఆ చిత్రం డిసాస్టర్ రజినీ ఖాతాలోకి చేర్చింది. పెద్దగా అంచనాలు లేకుండానే ఫిబ్రవరి 9 న విడుదలైన లాల్ సలామ్ చిత్రం ఇప్పుడు చాలా త్వరగా ఓటిటిలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

Advertisement
CJ Advs

జైలర్ తర్వాత వస్తున్న చిత్రమైన లాల్ సలామ్ పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. అటు ప్రమోషన్స్ కూడా చాలా వీక్ గా ఉండడంతో లాల్ సలామ్ ని ప్రేక్షకులు థియేటర్స్ లో పట్టించుకోలేదు. దానితో ఈ చిత్రం డిసాస్టర్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులని దక్కించుకుంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి మూడో వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం థియేటర్స్ లో డిసాస్టర్ అవడంతో మార్చ్ రెండో వారం కాని.. లేదంటే మార్చి 2 న కానీ స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

Lal Salaam Streaming Details:

Lal Salaam into OTT without turning a month
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs