ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి తో ప్యాన్ వరల్డ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి కల్కి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో అలరించబోతున్నారు. అయితే ఈమధ్య కాలంలో ప్రభాస్ చిత్రాలనే కాదు.. చాలామంది స్టార్ హీరోల చిత్రాలకి లీకులు అనేవి మేకర్స్ ని నిలవనియ్యడం లేదు. ఎన్ని కంప్లైంట్స్ రేజ్ చేసినా ఈ లీకులు అనేవి ఆగడం లేదు. సెట్స్ నుంచి హీరోల సన్నివేశాలు, వీడియోస్, పిక్స్, డైలాగ్స్ లీకవుతూనే ఉన్నాయి. ఇది ఏ ఒక్క హీరోకో జరుగుతున్న డ్యామేజ్ కాదు, ప్రతీ హీరో ఎదుర్కుంటున్న సమస్యే.
ఈమధ్యన కల్కి నుంచి పిక్స్, సీన్స్ లీకవగా.. నాగ అశ్విన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం రాజా సాబ్ నుంచి ఓ డైలాగ్ లీకైనట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ చూసి ప్రభాస్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నా గతంలో సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం నుచి ఓ డైలాగ్ లీకైనట్లుగా కొంతమంది ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఎలాంటి డైలాగ్ లీకవ్వలేదు అని, అది వేరే సినిమా డైలాగ్.. ఇదంతా కావాలనే ఎవరో క్రియేట్ చేసిన రూమర్, ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్ బయటికి రాలేదని ఈ చిత్ర కాంపౌండ్ వర్గాల నుంచే క్లారిటీ బయటకి వచ్చింది. సో ప్రభాస్ ఫాన్స్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.