రకుల్ ప్రీత్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది టాలీవుడ్ ప్రేక్షకులే. ఆమెకి దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ తప్ప రకుల్ నటించని స్టార్ హీరో లేరు. మహేష్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఏ పెద్ద హీరోని వదలకుండా రకుల్ అవకాశాలను అందిపుచ్చుకుంది. టాలీవుడ్ లో చక్రం తిప్పిన రకుల్ కి స్పైడర్ ఇచ్చిన షాక్ కోలుకోకుండా చేసింది. దానితో ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. ఏది ఏమైనా అక్కడి సినిమాలతోనే మళ్ళీ టాప్ పొజిషన్ తీసుకోవాలనుకుంది.
కానీ హిందీలోనూ రకుల్ కి నిరాశే ఎదురయ్యింది. అదలా ఉంటే రకుల్ ప్రీత్ ఈరోజు గోవాలో ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు నడవబోతుంది. మరి పెళ్ళికి రకుల్ చాలామంది సెలబ్రిటీస్ ని ఆహ్వానించింది. అందులో ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే ఉన్నారు. నిన్న మంగళవారం బాలీవుడ్ నుంచి చాలామంది గోవాకి పయనమయ్యారు. తనని స్టార్ ని చేసిన తెలుగు నుంచి ఏ ఒక్క సెలెబ్రిటీ గోవాకి వెళ్ళినట్టుగా కనిపించలేదు. ముంబై నుంచి అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, శిల్పా శెట్టి, ఇంకొంతమంది సెలెబ్రేటిస్ గోవాకి వెళ్లారు.
మరి రకుల్ ఇక్కడి స్టార్స్ ని ఇన్వైట్ చెయ్యలేదా.. లేదంటే రకుల్ పిలిచినా వీళ్ళే పట్టించుకోలేదా అనేది పక్కనపెడితే.. నెటిజెన్స్ మాత్రం రకుల్ నిన్ను పెద్ద హీరోయిన్ ని చేసిన టాలీవుడ్ ని మరిచిపోయావా తల్లి.. ఏమిటి అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రకుల్ ప్రీత్ కి ఎంతో క్లోజ్ అయిన ప్రగ్య జైస్వాల్, లక్ష్మీ మంచు లాంటి వాళ్ళు రకుల్ పెళ్ళికి హాజరయ్యే ఉంటారు. మరికాసేపాగితే ఆ ముచ్చట తెలిసిపోతుంది.