హిందీలో సీరియల్ నటిగా బుల్లితెర మీద అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు చేసినా బాలీవుడ్ లో అంతగా సక్సెస్ కాలేకపోయింది. హను రాఘవపూడి కంట్లో పడి సీతారామం చిత్రంతో సౌత్ లోకి సీతమ్మగా ఎంట్రీ ఇచ్చి ప్యాన్ ఇండియా ప్రేక్షకుల మనసులని హత్తుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఆడియన్స్ ని పడేసింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో తెలుగు ప్రేక్షకులకి మరింతగా దగ్గరయ్యింది. మరో నెల రోజుల్లో ఫ్యామిలీ స్టార్ తో మరోసారి ప్రేక్షకులని పలకరించబోతుంది.
సౌత్ లో సక్సెస్ అవుతున్నా మృణాల్ ని హిందీ భాష మాత్రం లైట్ తీసుకుంటూనే ఉంది. అయినా ముంబై భామ కాబట్టి మృణాల్ ముంబై లోని కాస్ట్లీ ఏరియా లో ఓ మంచి ఇల్లు కొనేసిందట. ముంబైలోని అంధేరి ప్రాంతంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా సోదరుడికి చెందిన ఇంటిని మృణాల్ ఠాకూర్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దాని విలువ ఎంత అనేది బయటికి రాకపోయినా మృణాల్ ఇంటి గురించి బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అంతేకాకుండా మృణాల్ ఇంకో ప్లాట్ కొనేందుకు కూడా చూస్తుంది అని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్. ప్రస్తుతం సౌత్ లో నిలదొక్కుకుని నార్త్ లో పాగా వేసేందుకు మృణాల్ ప్లాన్ చేసుకుంటుంది.