Advertisement
Google Ads BL

ట్రోల్ పై స్పందించిన శ్రీలీల


సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో రష్మిక రోల్ ని నెటిజెన్స్ తెగ ట్రోల్ చేసారు. అనిల్ రావిపూడి రష్మిక కేరెక్టర్ ని మరీ చీప్ గా చూపించాడు. మహేష్ పైకి ఎగబడి పోయేలా డిజైన్ చేయడంపై చాలామంది నెటిజెన్స్ రశ్మికని ట్రోల్ చెయ్యగా.. ఇకపై ఇలాంటి కేరెక్టర్స్ చెయ్యను అని ఆమె చెప్పింది. ఇప్పుడు గుంటురు కారంలోను శ్రీలీలని త్రివిక్రమ్ ఆల్మోస్ట్ అలానే చూపించారు. తండ్రి కోసం సంతకం పేరుతో మహేష్ ని ముగ్గులోకి దించేందుకు శ్రీలీలని వాడిన విధానంపై నెటిజెన్స్ ట్రోల్స్ చేసారు.

Advertisement
CJ Advs

సోషల్‌ మీడియాలో గుంటూరు కారంలోని శ్రీలీల కనిపించిన సన్నివేశాలను షేర్ చేస్తూ శ్రీలీలను విమర్శలు చేస్తున్నారు. శ్రీలీల అందంగా కనిపించినా ఆమె కేరెక్టర్ తేలిపోయింది. అయితే సోషల్ మీడియాలో శ్రీలీల సీన్ ని షేర్ చేస్తూ ఓ నెటిజెన్ ట్రోల్ చెయ్యగా.. దానికి శ్రీలీల కౌంటర్ ఇచ్చింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది పాపా అంటూ వెటకారంగా స్పందించింది. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల డాన్స్ స్టెప్స్ కి ఫుల్ మార్కులు పడ్డాయి. కానీ నటన విషయంలో మాత్రం శ్రీలీలని విమర్శించని వారు లేరు. 

మరి స్టార్ హీరో సినిమా శ్రీలీలకి మంచి చేయకపోగా.. ఇలాంటి ట్రోల్స్ కి గురయ్యేలా చేసింది అని శ్రీలీల అభిమానులే ఫీలయ్యారు. ప్రస్తుతం శ్రీలీల మార్క్ టాలీవుడ్ లో కనిపించడం లేదు. ఆమె ఓకె చేసిన VD13, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. 

Sreeleela responded to trolls:

Sreeleela reacts to a troll about her performance in Guntur Kaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs