బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటో గ్రాఫర్స్ వాలిపోయి వాళ్ళని ఫొటోస్ తియ్యడానికి ఎగబడిపోవడం చూస్తూనే ఉంటాము. బాలీవుడ్ లోనే కాదు ఎక్కడ చూసినా ఇలాంటివి కనిపిస్తాయి. అయితే బాలీవుడ్ లో హీరోయిన్స్ ఎయిర్ పోర్ట్, జిమ్ కి వెళ్ళగానే అక్కడి ఫోటో గ్రాఫర్స్ ఫొటోస్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటో గ్రాఫర్స్ ఆ కంటెంట్ ని టాప్ వెబ్ సైట్స్ కి విక్రయిస్తూ ఉంటారు. అసలు ఆ ఫోటో గ్రాఫర్స్ నటుల వెంటపడి ఫొటోస్ తీసి పబ్లిసిటీ చెయ్యరట.
దీని కోసం కొంతమంది హీరోయిన్స్ ఆ ఫోటో గ్రాఫర్స్ కి డబ్బులిచ్చి ఫొటోస్ తీయించుకుని పబ్లిసిటీ చేయించుకుంటారట. ఈ విషయాన్ని తెలుగు హీరోయిన్ ప్రియమణి బట్టబయలు చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో నటించినా పెద్దగా ఎదగలేని ప్రియమణి ఒకటి రెండు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. అక్కడ పలు షోస్ లో జెడ్జ్ గా కనిపించిన ప్రియమణి ఈమధ్యన జవాన్, నెరు, భామాకలాపం2 లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ప్రియమణి మట్లాడుతూ బాలీవుడ్ లో పపరాజీ కల్చర్ బండారం బయటపెట్టింది.
చాలామంది హీరోయిన్స్ జిమ్ముల దగ్గర, ఎయిర్ పోర్ట్స్ లో కనిపించగానే ఫోటో గ్రాఫర్స్ వెంటపడి ఫొటోస్ తీస్తారు అనుకుంటారు, కానీ సదరు సెలబ్రిటీస్ తమ పాపులారిటీ కోసం డబ్బులిచ్చి ఫొటోస్ తీయించుకుంటారు. నేను జవాన్ తర్వాత ముంబై వెళితే.. ఓ ఏజెన్సీ వాళ్ళు నాకు పపరాజీ కల్చర్ కి సంబంధించి ఎంత ఖర్చవుతుందో అనేది ఓ ఛార్జ్ పంపించారు.. అంటూ ప్రియమణి సెలబ్రిటీస్ ఫొటోస్ వెనుక ఉన్న అసలు నిజాలని రివీల్ చేసింది.