Advertisement
Google Ads BL

నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే: రకుల్


తెలుగులో సందీప్ కిషన్ వేంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ముంబై లో సెటిలైంది. రకుల్ ప్రీత్ రేపు బుధవారమే తాను ప్రేమించిన జాకీ భగ్నానీతో ఏడడుగులు నడిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. గోవా వేదికగా రకుల్ ప్రీత్ పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలాగే రకుల్ నటనని కొనసాగిస్తుంది అనడానికి ఆమె ఓకె చేస్తున్న ప్రాజెక్ట్స్ నిదర్శనం. అయితే తాజాగా రకుల్ తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన పేరెంట్స్ అని చెబుతుంది.

Advertisement
CJ Advs

హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలకి వాళ్ళ తల్లులు తోడుగా ఉంటారనే విషయం తెలిసిందే. వాళ్ళు ఒక స్టేజ్ కి చేరుకునేవరకు తల్లులు వెన్నంటే ఉంటారు. మరి రకుల్ ప్రీత్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆమె తల్లి తనకు తోడుగా షూటింగ్స్ కి వచ్చేవారట. ఈ విష‌యాన్ని రకుల్ స్వ‌యంగా రివీల్ చేసింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ని తన తల్లి 25 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కూ త‌న వెంటే ఉందట‌. రకుల్ సినిమా ఇండస్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో అస్స‌లు విడిచిపెట్టి ఉండేవారు కాదట‌. హీరోయిన్ గా ఇండస్ట్రీలో తాను సెటిల్ అయ్యేవరకు ఆమె వెంట ఉండి అన్ని ర‌కాలుగా స‌హాయం అందించింద‌ని తెలిపింది. 

రకుల్ సినిమాల్లోకి రాకముందే మోడలింగ్ చేసిందట. ఆ మోడలింగ్ లోనే ర‌కుల్ తొలిసారి 5 వేలు అందుకుందట. తన తల్లితండ్రుల సహకారం లేకపోతే తాను ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేదాన్ని అని, వాళ్ల స‌హ‌కారం లేనిదే తాను ఏది సాధించ‌లేన‌ని రకుల్ చెప్పుకొచ్చింది.

What was Rakul Preet Singh first salary?:

Rakul Preet Singh reveals details of her first pay cheque
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs