పిల్లలకి మార్చి లో పరిక్షలు అయిపోతే.. ఏప్రిల్ మొత్తం కొత్త సినిమాలు చూసే మూడ్ లో ఉంటారు. అందుకే మేకర్స్ కూడా ఏప్రిల్ మొదలుకుని మే వరకు కొత్త సినిమాలు విడుదల చేసేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొత్తం పెద్ద, చిన్న సినిమాలేవీ రావడం లేదు. ఏప్రిల్ 5 న రాబోయే ఫ్యామిలీ స్టార్ తప్ప ఏప్రిల్ లో మరో పెద్ద సినిమా కానీ, ఇంట్రెస్టింగ్ సినిమా కానీ విడుదల కావడం లేదు. కారణం మేకర్స్ ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. మార్చ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే.. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయి. మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు ఏపీలో ఎక్కడ చూసినా జనాలు ఎన్నికల ఫీవర్ లో కనబడతారు. రాజకీయనాయకులు ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తారు. గల్లీ నుంచి సిటీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలా మొత్తం జాతరని తలపిస్తుంది. ఆ సమయంలో సినిమాలు విడుదల చేస్తే ఎంతగా హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావు.
జనాలు థియేటర్స్ కి వెళ్లేందుకు అంతగా ఇష్టపడరు. ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల మూడ్ లో ఉంటారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయంలో బెట్టిం లు గట్రా.. అందుకే మేకర్స్ అందరూ ఏప్రిల్ లో సినిమాలు విడుదల చెయ్యడానికి సాహసించకుండా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు.