Advertisement
Google Ads BL

దంగల్ నటి మృతి పై స్పందించిన తల్లి


అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం దంగల్ లో బబిత కుమారి పాత్రలో కుస్తీపోటీల్లో పాల్గొన్న అమ్మాయిగా తన నటనతో అందరి మనసులని గెలుచుకున్న సుహాని భట్నాగర్ 19 ఏళ్ళు నిండకుండానే అకాలమరణం చెందడం పట్ల అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. దంగల్ తర్వాత సుహాని మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. చదువు పై దృష్టి పెట్టిన సుహాని సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండేది. కానీ ఉన్నట్లుండి సుహాని మరణించడం పట్ల అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

Advertisement
CJ Advs

ఆమె మరణం పట్ల సుహాని తల్లి పూజ భట్నాగర్ తొలిసారి స్పందించారు. సుహాని ఈవ్యాధితో చాలారోజులుగా పోరాడుతుంది. మేము సాధారణ స్కిన్ ప్రాబ్లెమ్ అనుకుని చాలామంది డెర్మటాలజిస్ట్ లని కలిసాము. కానీ సుహానికి తగ్గలేదు. అమీర్ ఖాన్ మొదటి నుంచి సుహానికి సపోర్ట్ గా నిలిచారు. కానీ మేము సుహాని వ్యాధి గురించి ఎవ్వరికి చెప్పలేదు, ఆఖరికి అమీర్ కి కూడా  తెలపలేదు. సుహాని వ్యాధి నయం కాకపోవడంతో ఆమెని ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ చేసాము. అక్కడే సుహానికి డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లుగా తేలింది. 

ఈ వ్యాధికి వైద్యం లేదని తెలిసింది. సుహాని స్కిన్ మొత్తం ఇన్ఫెక్షన్ కి గురి కావడంతో ఆమె శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. దానితో సుహాని ప్రాణాలు కోల్పోయినట్లుగా సుహాని తల్లి పూజ చెప్పారు.

Mother reacts on the death of the Dangal actress:

Suhani Bhatnagar Mom On Suhani Death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs