Advertisement
Google Ads BL

బోర్ కొట్టేస్తుందేమో బాసు ఆలోచించండి


ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి చాలామంది దర్శకనిర్మాతలు బాలీవుడ్ భామ ఊర్వశి వైపే చూస్తున్నారు. గత ఏడాది వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ సరసన ఐటెం స్టెప్స్ వేసిన ఊర్వశి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో లోను ఆడిపాడింది. బోయపాటి స్కంద లోను స్పెషల్ డాన్స్ చేసింది. ఇక ఈ ఏడాది బాలకృష్ణ - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఊర్వశి రౌతేల్ల కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మెగాస్టార్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో ఆడబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ తో విశ్వంభర మూవీ చేస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు రీసెంట్ గానే సెట్స్ లోకి వెళ్లారు. కొద్దిరోజులు షూటింగ్ చేసాక చిన్న బ్రేకిచ్చి చిరు ఆయన భార్యతో కలిసి స్నేహితుడి ఇంట్లో శుభ కార్యం కోసం అమెరికా వెళ్లారు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే త్రిష ఒక హీరోయిన్ గా ఎంపికవడమే కాదు విశ్వంభర సెట్స్ లోకి కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఊర్వశి రౌతేల్ల విశ్వంభర లో ఐటెం సాంగ్ చేయబోతుంది అనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.

దానితో మెగా అభిమానులు బాసు ఊర్వశి అంటే బోర్ కొట్టేస్తుందేమో కాస్త ఆలోచించండి.. ఇప్పటికే ఆమె మీతో ఐటమ్ స్టెప్స్ వేసింది. మీ తమ్ముడితోనూ ఆడిపాడింది. మరోపక్క ఆమె ఐటెం సాంగ్స్ చేస్తుంది. అందుకే బోర్ కొట్టేస్తుంది.. ఓ కొత్త హీరోయిన్ ని తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Urvasi special in Vishwambhara:

Urvashi Rautela special in Chiranjeevi Vishwambhara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs