Advertisement
Google Ads BL

బండ్ల గణేష్ పై భారీ అభియోగం


కొద్దిరోజులుగా బండ్ల గణేష్ పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బండ్ల గణేష్ కి ఇల్లు అద్దెకిచ్చినట్టుగా, ఆ తర్వాత తనపైనే కేసు పెట్టిపెట్టి బండ్ల తనని ఇబ్బంది పెడుతున్నట్టుగా హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి నౌహీరాషేక్‌ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండ్ల గణేష్ కి నా ఇంటిని అద్దెకు ఇచ్చాను.. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు.. నౌహీరాషేక్‌ ఆరోపించారు.

Advertisement
CJ Advs

బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో నిన్న శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 75 కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్‌ స్కెచ్‌ వేసాడని, ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు తాము అక్కడికి వెళ్లామని, తాము అక్కడ ఉండగానే పోలీసులు వచ్చి కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

హడావిడి చేస్తూ తనకి రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్‌ తమముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇంటిపై పదకొండు నెలల రెంట్‌ అగ్రిమెంట్‌ను బండ్ల గణేశ్‌ ఫోర్జరీ చేశాడని, దీనిపై తమకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఫిలింనగర్‌ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Nowhera Shaik on Bandla Ganesh:

Nowhera Shaikh Revels Shocking Facts About Bandla Ganesh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs