సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవ కోన చిత్రం గత శుక్రవారం విడుదలైంది. అటు సందీప్ కిషన్ ఫామ్ లో లేడు, ఇటు అనిల్ సుంకర ఏజెంట్, భోళా శంకర్ డిజాస్టర్స్ తో ఇబ్బందుల్లో ఉన్నాడు. మరోపక్క దర్శకుడు వి ఆనంద్ కి కూడా సక్సెస్ లేకపోవడంతో ఊరు పేరు భైరవకోన థియేటర్స్ లోకి వస్తుంది అన్నా అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. పెయిడ్ ప్రీమియర్స్ తో కాస్త కదలిక వచ్చినా.. మొదటిరోజు బుకింగ్స్ పై అందరిలో అనుమానాలే. ఇక సినిమా విడుదలయ్యాక భైరవకోన పై మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిలబడదని అనుకున్నారు.
సందీప్ కిషన్ పెరఫార్మెన్స్ బావున్నా.. వీక్ VFX, అలాగే ఎమోషన్స్ పండకపోవడం వంటి అంశాలతో ప్రేక్షకులు కూడా ఊరు పేరు భైరవకోనకి మిక్స్డ్ టాక్ ఇచ్చారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రం రెండోరోజు కూడా బెటర్ ఫిగర్స్ నమోదు చేసింది. మొదటి రోజు 6.03 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఈ చిత్రం రెండో రోజు 13.10 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లుగా మేకర్స్ కలెక్షన్స్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈలెక్కన పబ్లిక్ టాక్ కి, క్రిటిక్ ఇచ్చిన రివ్యూస్ కి ఎక్కడా పొంతన లేకుండా ఊరు పేరు భైరవ కోన కలెక్షన్స్ సాధిస్తుంది. మరి ఈ వీకెండ్ పూర్తయ్యాక దీని పెరఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.